తప్పించుకున్న మావోయిస్టులు ఎక్కడ?
close

ప్రధానాంశాలు

Updated : 18/06/2021 06:00 IST

తప్పించుకున్న మావోయిస్టులు ఎక్కడ?

తీగలమెట్టను జల్లెడ పడుతున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎదురుకాల్పుల్లో ఆరుగురు మరణించగా.. 20 మందికి పైగా తప్పించుకున్నారని, వీరిలో కొందరికి బుల్లెట్‌ గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి అరుణ, గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి జగన్‌, మరో అగ్రనేత ఉదయ్‌ అలియాస్‌ గాజర్ల రవి తప్పించుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ఆచూకీ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు.

అదనపు బలగాలతో గాలింపు
ఎదురుకాల్పుల్లో పాల్గొన్న బలగాలు తిరుగుముఖం పట్టక ముందే తీగలమెట్టలో అదనపు బలగాలను దించారు. గాయపడ్డవారు అడవిలోనే ఉంటారనే అనుమానంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు, అటు ఒడిశా వైపు నుంచి సుమారు పది ప్రత్యేక పార్టీలకు చెందిన 250 మంది పోలీసులు ఈ గాలింపులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారు ఆర్‌ఎంపీల వద్ద చికిత్స పొందే అవకాశం ఉంటుందని భావించి.. చుట్టుపక్కల గ్రామాలు, ఆసుపత్రులపై నిఘా పెట్టారు.

నమ్మినోళ్లే ముంచేశారా..?
మావోయిస్టులు గ్రామాల్లో కొందరు కొరియర్లను నమ్మకంగా పెట్టుకుంటారు. వారి వద్దే ఆశ్రయం పొంది భోజనాలు చేస్తారు. తీగలమెట్ట ఘటనలో ఇలాంటివారే పోలీసులకు సహకరించారని, అందుకే మావోయిస్టులున్న ప్రాంతానికి అతి సమీపంగా పోలీసులు రాగలిగారని స్థానికులు అనుమానిస్తున్నారు. 

కరోనా ఉద్ధృతి వల్ల పోలీసులు కూంబింగ్‌కు వచ్చే అవకాశాలు తక్కువని మావోయిస్టులు అంచనా వేసుకున్నారు. అందుకే గ్రామాల సందర్శనతో పార్టీని బలపర్చుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండలాల్లోని పలు తండాల్లో గిరిజనులతో సమావేశమయ్యారు. అప్పటికే మావోయిస్టుల కదలికలపై కన్నేసిన పోలీసులకు.. తీగలమెట్ట అడవిలో ఉన్నట్లు పక్కా సమాచారం చేరింది. రాత్రికి రాత్రి వెళ్లడం, తెల్లవారేసరికి కాల్పులు... ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయాయి.

శవాగారానికి మావోయిస్టుల మృతదేహాలు
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గురువారం సాయంత్రం 6.10 గంటలకు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాలను ఫ్రీజర్‌ బాక్సుల్లో అమర్చిన తరవాత రాత్రి 7.50 సమయంలో మీడియాను అనుమతించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన