ఇంటి వాసాలే చితి.. నిర్వాసితుడి ఆత్మాహుతి
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 11:08 IST

ఇంటి వాసాలే చితి.. నిర్వాసితుడి ఆత్మాహుతి

కూలిన కొయ్యలు పేర్చుకుని నిప్పు పెట్టుకున్న బాధితుడు
మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌లో ఘటన

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట - తొగుట, న్యూస్‌టుడే: సొంతూరిపై మమకారం... చిన్నప్పటి నుంచీ పెనవేసుకున్న అనుబంధం తెగిపోతోందన్న ఆవేదన.. వెరసి ఆ వృద్ధుడి ఆత్మాహుతికి దారితీశాయి. ఊరికి దూరంగా వెళ్లలేక... కూలిన తన ఇంటి గోడల సాక్షిగా..ఆ ఇంటి వాసాలనే చితి కట్టెలుగా పేర్చుకుని వాకిట్లోనే ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు గ్రామం సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తూటుకూరి మల్లారెడ్డి (70)కి ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేశారు. పెద్దకుమార్తె, అల్లుడు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుమారుడు తిరుపతిరెడ్డి తాత వద్ద ఉండేవాడు. పది నెలల కిందట మల్లారెడ్డి భార్య అమృతమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. మరోవైపు మల్లన్నసాగర్‌ పనులు చివరి దశకు చేరుకుంటుండటంతో ఊరు ఖాళీ చేయాల్సి వచ్చింది. గజ్వేల్‌ సమీపంలోని ముట్రాజ్‌పల్లిలో ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ఇళ్లకు గ్రామస్థులు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. ఆర్నెల్ల క్రితం మల్లారెడ్డి కూడా తన మనవడితో కలసి కొత్త ఇంట్లో ప్రవేశించారు.

ఒక్కసారి ఊరిని చూసొస్తా బిడ్డా..
మల్లారెడ్డి చిన్నకుమార్తె భాగ్య భర్తకు దూరంగా గజ్వేల్‌ సమీపంలోని పిడిచెడ్‌ గ్రామంలో పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. మల్లారెడ్డి 20 రోజుల కిందట ఆమె ఇంటికి వెళ్లి అక్కడే ఉన్నారు. ఈలోగా ఊళ్లోని తన ఇల్లు కూల్చేస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆయన ఓసారి ఊరు చూసొస్తానంటూ గురువారం వేములఘాట్‌కు వెళ్లారు. ఆ రోజు రాత్రే ఆత్మాహుతికి పాల్పడ్డారు. తెల్లవారుజామున గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తొగుట ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ గృహం తన తండ్రి పేరు మీద కాకుండా మనవడు తిరుపతిరెడ్డి పేరుతో ఇచ్చారని భాగ్య ఆరోపించారు. తనకు ఇల్లు రాలేదనే మనస్తాపంతోనే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మల్లారెడ్డి కుటుంబానికి రావాల్సిన పరిహారాలన్నీ అందజేసినట్లు ఆర్డీవో అనంతరెడ్డి స్పష్టంచేశారు.


భాజపా, కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

ల్లారెడ్డి మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అక్కడికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన వేములఘాట్‌కు వెళ్తున్న క్రమంలో తుక్కాపూర్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గ బాధ్యుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆ గ్రామానికి బయలుదేరగా గజ్వేల్‌ మండలం కొల్దూరు శివారులో అడ్డుకొని దౌల్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన