పసి ప్రాణాన్నిచిదిమిందెవరు?
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 11:07 IST

పసి ప్రాణాన్నిచిదిమిందెవరు?

రెండు నెలల శిశువు దారుణ హత్య
నీళ్ల ట్యాంకులో మృతదేహం

పుష్కర కాలం తర్వాత ఆ ఇంట్లో పసిబిడ్డ సందడి... కుటుంబమంతా అల్లారుముద్దుగా చూసుకుంటున్న సమయం...  ఎవరి కన్ను కుట్టిందో.. ఎవరి గుండె పాషాణంగా మారిందో .. తెల్లారేసరికి ముద్దులొలికే రెండు నెలల బాలుడిని నీళ్ల ట్యాంకులో ముంచేసి ప్రాణాలు బలిగొన్నారు.  ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది...

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌కి చెందిన మంచాల రంగయ్య, పద్మల కుమార్తె బాలమణి(లత)ని నెర్రపల్లికి చెందిన దూసరి తిరుమలేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహమైన 12 ఏళ్లకు వారికి బిడ్డ కలగడంతో అందరూ ఆనందించారు. కాన్పుకోసం అనాజ్‌పూర్‌ వచ్చిన లత పుట్టింట్లోనే ఉన్నారు. మూడు రోజుల క్రితం రెండు నెలలు నిండడంతో బాబుకు ఉమామహేశ్వర్‌ అని పేరు పెట్టి వేడుక చేసుకున్నారు. గురువారం రాత్రి లత తన కుమారుడిని పొత్తిళ్లలో వేసుకొని నిద్రించారు. ఆమె తల్లిదండ్రులు రంగయ్య, పద్మ, సోదరుడు బాలరాజు, ఆయన భార్య శ్వేత వేర్వేరు గదుల్లో ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వేళ నిద్ర లేచిన లత పక్కలో బాబు లేకపోవడంతో ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల వెతికారు. బాబును ఎవరైనా అపహరించి ఉంటారా అని భావించి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పరిశీలించినా ఎలాంటి అచూకీ లభించలేదు. ఉదయం 7 గంటల వేళ ఇంటి పైనున్న నీళ్ల ట్యాంకును పరిశీలిస్తే అందులో బాలుడి మృతదేహం లభ్యమైంది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. రెండు నెలల బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లతకు వివాహమైన పన్నెండేళ్లకు సంతానం కలగడం.. ఆమె సోదరుడికి ఇంకా సంతానం లేకపోవడం.. కుటుంబంలో గొడవలు తదితర అంశాలపై పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం. లత సోదరుడు బాలరాజును, ఆయన భార్య శ్వేతను అదుపులోకి తీసుకొని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన