కంట్లో కారం కొట్టారు.. గొడ్డళ్లతో నరికారు 
close

ప్రధానాంశాలు

Updated : 20/06/2021 06:36 IST

కంట్లో కారం కొట్టారు.. గొడ్డళ్లతో నరికారు 

అన్నదమ్ముల మధ్య భూ వివాదం

సోదరుడి కుటుంబంపై దాడి

ముగ్గురి దారుణ హత్య

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గంగారంలో ఘటన

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కాటారం, న్యూస్‌టుడే: పాత కక్షలు నెత్తుటేరులు పారించాయి. భూ తగాదాలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘటన శనివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారానికి చెందిన మంజు నాయక్‌(60), అతని తమ్ముడు మహంకాళి కుటుంబాలకు ఊరిలోని భూమి విషయంతో గొడవలు జరుగుతున్నాయి. దీనిపై కాటారం పోలీస్‌ స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. వ్యవసాయ పనుల కోసం శనివారం మంజునాయక్‌ కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లడం గమనించిన మహంకాళి కుటుంబ సభ్యులు కూడా అక్కడకు వచ్చారు. రెండు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మంజునాయక్‌, అతని కుమారులు సారయ్యనాయక్‌(40), భాస్కర్‌ నాయక్‌(36), తదితరులపై.. మహంకాళి నాయక్‌, ఆయన కుమారులు భాస్కర్‌ నాయక్‌, బాపు నాయక్‌, సద్దార్‌ నాయక్‌, భార్య కౌసల్య కారంపొడి చల్లి గొడ్డళ్లతో నరికారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దాడిలో మంజునాయక్‌ రెండో కుమారుడు సమ్మయ్యనాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అదనపు ఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భూ వివాదంపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చివరికి తమ వారిని కోల్పోయాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముందే స్పందించి సమస్యకు పరిష్కారం చూపితే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని విలపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన