TS News: ఆడబిడ్డ నవ్విందని.. ఆమె బిడ్డను చంపేసింది! 
close

ప్రధానాంశాలు

Updated : 20/06/2021 07:01 IST

TS News: ఆడబిడ్డ నవ్విందని.. ఆమె బిడ్డను చంపేసింది! 

అనాజ్‌పూర్‌లో పసికందు హత్యకేసును ఛేదించిన పోలీసులు

తనకు ఇక పిల్లలు పుట్టరంటూ ఆడపడుచు అవమానించిందని కక్ష పెంచుకున్న ఆ మహిళ ఓ పసిప్రాణాన్ని నిర్దయగా తీసేసింది... సంతానం లేకపోతే కలిగే బాధ తన ఆడపడుచుకు కూడా తెలిసేలా చేయాలని నిర్ణయించుకున్న ఆమె తల్లి పొత్తిళ్లలోని రోజుల బిడ్డను చిదిమేసింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన రెండు నెలల పసిబాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ పసిబిడ్డను దారుణంగా అంతం చేసింది స్వయానా బాలుడి మేనమామ భార్య కావడం సంచలనంగా మారింది. శనివారం వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసం స్వామి, ఎస్సై వీరభద్రంతో కలిసి హత్య కేసు వివరాలను వెల్లడించారు. అనాజ్‌పూర్‌కు చెందిన లత(బాలమణి)కు ఇబ్రహీంపట్నం మండలం నెర్రెపల్లికి చెందిన దూసరి తిరుమలేష్‌కు పెళ్లయిన పన్నెండేళ్లకు బాబు జన్మించాడు. బిడ్డ పుట్టినప్పటి నుంచి లత అనాజ్‌పూర్‌లోని పుట్టింట్లో ఉంటోంది. తమ్ముడు బాలరాజు భార్య శ్వేతకు రెండు నెలల క్రితం మూడు నెలల గర్భంతో ఉండగా అనారోగ్య కారణంగా గర్భస్రావమైంది. ఆ సమయంలో ఆడబిడ్డ లత తన పరిస్థితి చూసి నవ్విందని, థైరాయిడ్‌ ఉన్న వాళ్లకు తొందరగా గర్భం రాదంటూ అవమానించిందని శ్వేత ఆమెపై పగ పెంచుకుంది. పిల్లలు లేకపోతే కలిగే బాధను లతకు తెలిసేలా చేయాలని, ఆమెకు లేకలేక కలిగిన మగబిడ్డను అంతం చేయాలని భావించింది. వారం రోజులుగా సమయం కోసం చూసింది. శుక్రవారం తెల్లవారుజామున పసి బాలుడిని తల్లి పక్కలో నుంచి అపహరించి ఇంటిపైకి తీసుకెళ్లింది. బాలుడి ముక్కు, ఛాతీపై అదిమి హత్య చేసేందుకు ప్రయత్నించగా.. బాలుడు నిద్రలేచి ఏడుపు మొదలుపెట్టాడు. దీంతో కంగారు పడిన శ్వేత బాలుడిని పక్కనే ఉన్న నీటి ట్యాంకులో వేసి అక్కడే అయిదు నిమిషాల సేపు ఉండి చనిపోయాడని నిర్ధారించుకుని ఇంట్లోకి వెళ్లి ఏమీతెలియనట్లు పడుకుంది. అంతలోనే నిద్రలేచిన లత తన కుమారుడు కనిపించడం లేదని ఆందోళన చెందగా.. కుటుంబ సభ్యులతో కలిసి శ్వేత ఏమి తెలియనట్లు నటించింది. పోలీసులకు లత ప్రవర్తనపై అనుమానం రావడం, బయటి వారు ఇంట్లోకి వచ్చి బాలుడిని హత్య చేసే అవకాశాలు కనిపించక పోవడంతో బాలుడి హత్యకు కుటుంబ సభ్యులే కారణమన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్వేతను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా శ్వేత నేరం అంగీకరించింది. శ్వేతను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన