‘హద్దు’ దాటొద్దంటే హత్యలు చేశారు
close

ప్రధానాంశాలు

Updated : 20/06/2021 13:12 IST

‘హద్దు’ దాటొద్దంటే హత్యలు చేశారు

ఎస్సై సయోధ్య కుదిర్చిన గంటల్లోనే ఘాతుకం
అనంతపురం జిల్లాలో ఇద్దరి ప్రాణాలు తీసిన భూవివాదం

యల్లనూరు, తాడిపత్రి గ్రామీణం, న్యూస్‌టుడే: గొడవలొద్దు.. సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని ఎస్సై రెండు వర్గాలకు సూచనలు చేసిన గంటల్లోనే ఓ వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. శనివారం జరిగిన ఈ ఘటనతో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం ఆరవేడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి సబ్‌డివిజన్‌ డీఎస్పీ వీఎన్‌కే చైతన్య వివరాల ప్రకారం.. ఆరవేడు గ్రామానికి చెందిన నారాయణప్పకు, అదే గ్రామానికి చెందిన నగేష్‌కు మధ్య కొంత కాలంగా భూ తగాదాలున్నాయి. ఇద్దరి మధ్య బోరు బావి ఉన్న భూమి హద్దు విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. గతంలో పరస్పరం కేసులూ పెట్టుకున్నారు. ఇటీవల యల్లనూరుకు కొత్తగా వచ్చిన ఎస్సై ఏపీ.మస్తాన్‌ విషయం గుర్తించి.. శనివారం రెండు వర్గాలను స్టేషన్‌కు పిలిపించారు. గతంతో జరిగిన కేసుల గురించి విచారించి, గొడవలు పడకూడదని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసి పంపారు. ఈ క్రమంలో జిట్టా నారాయణప్ప (38), అతని సోదరుడు జిట్టా రాజగోపాల్‌ (52) కలిసి ఎస్సై దగ్గర నుంచి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరు వాసాపురం గ్రామ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. రాజగోపాల్‌, నారాయణప్ప కిందపడిపోగా కత్తులు, బండరాళ్లతో దాడి చేసి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు హత్యలు చేసింది నగేశ్‌ అతని బంధువు దేవరాజ్‌ అని వారికి చెందిన 300 చీనీ మొక్కలను పీకేసి, అందులోని డ్రిప్‌, పైపులైన్లను ధ్వంసం చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చి మృతుల బంధువులను పరామర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన