ఝార్ఖండ్‌లో ఎదురుకాల్పులు

ప్రధానాంశాలు

Updated : 18/07/2021 06:24 IST

ఝార్ఖండ్‌లో ఎదురుకాల్పులు

కీలక నక్సలైట్‌ హతం

రాంచీ: ఝార్ఖండ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో కీలక నక్సలైట్‌ ఒకరిని భద్రత దళాలు హతమార్చాయి. ఖుంతీ, పశ్చిమ సింగ్‌భుమ్‌ జిల్లాల సరిహద్దుల్లో భద్రత దళాలు గాలింపు చర్యలు చేపడుతుండగా ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎల్‌ఎఫ్‌ఐ)’కి చెందిన నక్సలైట్లు కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భద్రత దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పీఎల్‌ఎఫ్‌ఐ జోనల్‌ కమాండర్‌ శనిచర్‌ సురీన్‌ హతమైనట్లు చెప్పారు. మిగతా నక్సలైట్లు తప్పించుకున్నట్లు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన