‘రైతు బీమా’ పత్రానికి లంచం డిమాండ్‌.. ఏవో అరెస్టు

ప్రధానాంశాలు

Published : 24/07/2021 04:35 IST

‘రైతు బీమా’ పత్రానికి లంచం డిమాండ్‌.. ఏవో అరెస్టు

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: రైతు బీమా మంజూరుకు సంబంధించి ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు లంచం అడిగిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ వ్యవసాయాధికారి బొల్లినేని శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన మలిగిరెడ్డి అన్వేశ్‌రెడ్డి ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వ్యవసాయ భూమి ఉన్నందున రైతు బీమా డబ్బు కోసం ఆయన మేనమామ గండ్ర శ్రీనివాసరెడ్డి ఈ నెల 16న ఏవో శ్రీనివాస్‌ను కలిశారు. సంబంధిత పత్రం ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఏవో డిమాండ్‌ చేశాడు. దీంతో గండ్ర శ్రీనివాసరెడ్డి అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచనతో ఈ నెల 17న మరోసారి ఏవో శ్రీనివాస్‌ను కలిసి.. రూ.12 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీనివాసరెడ్డి నుంచి ఏవో రూ.12 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. కార్యాలయానికి తీసుకువెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఏవోను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్గొండ అనిశా ఇన్‌ఛార్జి డీఎస్పీ వేణుగోపాల్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన