రుయా ఘటనకు ఏజెన్సీ నిర్లక్ష్యమే కారణం

ప్రధానాంశాలు

Updated : 24/07/2021 05:46 IST

రుయా ఘటనకు ఏజెన్సీ నిర్లక్ష్యమే కారణం

అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): తిరుపతి రుయా ఆసుపత్రిలో మే పదో తేదీ రాత్రి జరిగిన దుర్ఘటనకు ఆక్సిజన్‌ సరఫరా ఏజెన్సీ కర్నూలుకు చెందిన శ్రీ భారత్‌ ఫార్మా అండ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్లక్ష్యమే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి అలిపిరి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆక్సిజన్‌ అందక 23 మంది మరణించడంపై న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. శుక్రవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డాక్టర్‌ భారతి పలు అంశాలను ప్రస్తావించారు. ఆక్సిజన్‌ నిల్వలు తగ్గుతున్నాయని హెచ్చరించినా తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసే విషయంలో ఏజెన్సీ తీవ్ర జాప్యం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ విచారణలో వెలుగు చూసిందన్నారు. ఆక్సిజన్‌ తగ్గుతున్నప్పుడు అలారం పనిచేయలేదని కూడా విచారణలో తెలిసిందన్నారు. అలిపిరి సీఐ దేవేందర్‌కుమార్‌ కేసు నమోదు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన