చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య

ప్రధానాంశాలు

Published : 25/07/2021 04:54 IST

చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య

కుషాయిగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ శివారు చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుషాయిగూడ ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాళ్లగడ్డకు చెందిన షేక్‌ ఖాజామియా అలియాస్‌ ఎండీ ఖాజాబాబా(35) లారీ డ్రైవర్‌గా పని చేస్తూ.. చర్లపల్లి బీఎన్‌రెడ్డి కాలనీలో నివసిస్తున్నాడు. ఏటీఎంలో చోరీ కేసులో ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. శనివారం ఉదయం 9.40 సమయంలో జైలు మరుగుదొడ్డి కిటికీ ఊచలకు ఉరి వేసుకున్న ఖాజామియాను.. జైలు వార్డెన్‌ గుర్తించి ప్రథమ చికిత్స అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఖైదీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన