ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ మృతి

ప్రధానాంశాలు

Published : 26/07/2021 05:24 IST

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ మృతి

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా అగుడోంగ్రీ-పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టు కమాండర్‌ మృతి చెందారు. చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అగుడోంగ్రీ-పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు నేతలు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులకు పక్కా సమాచారం వచ్చింది. సీఆర్‌పీఎఫ్‌, డీఆర్జీ, ఎస్టీఎఫ్‌ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సమయంలో తారసపడిన మావోయిస్టులు బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు జన మిలీషియా కమాండర్‌ కుంజం బీమా(25) మృతి చెందారు. తుపాకులు, టిఫిన్‌ బాంబులు, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలు  స్వాధీనం చేసుకున్నామని,  బీమాపై గతంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.లక్ష రివార్డు ప్రకటించిందని సుక్మా జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన