ప్రాణం తీసిన అతివేగం

ప్రధానాంశాలు

Published : 26/07/2021 05:24 IST

ప్రాణం తీసిన అతివేగం

కారు బోల్తాపడి హైదరాబాద్‌ యువతి మృతి
తమిళ నటి యాషికా ఆనంద్‌ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు

మహాబలిపురం, న్యూస్‌టుడే: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ సినీ నటి, బిగ్‌బాస్‌ ఫేం యాషికా ఆనంద్‌ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యాషికా ఆనంద్‌ స్నేహితురాలు హైదరాబాద్‌కు చెందిన వల్లిశెట్టి భవానీ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాషికా ఆనంద్‌, హైదరాబాద్‌కు చెందిన వల్లిశెట్టి భవానీ(28), మరో ఇద్దరు యువకులు శనివారం రాత్రి పుదుచ్చేరి నుంచి చెన్నైకు కారులో బయలుదేరారు. మహాబలిపురం సమీపం సూళేరిక్కాడు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భవానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి.. బాధితులను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మహాబలిపురం పోలీసులు భవానీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భవానీ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన