పోలీసులపై ఇసుక స్మగ్లర్ల దాడి

ప్రధానాంశాలు

Published : 28/07/2021 05:18 IST

పోలీసులపై ఇసుక స్మగ్లర్ల దాడి

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులపై స్మగ్లర్లు దాడిచేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలో సోమవారం రాత్రి జరిగింది. వెంపల్లి పెద్దవాగులో ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో శిక్షణ ఎస్సై వెంకటేశ్‌, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ అక్కడికి వెళ్లారు. స్మగ్లర్లు రాళ్లు, పారలతో దాడిచేయడంతో శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ గాయపడ్డారు. నిందితుల్లో పది మందిని అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన