ఆసుపత్రి నుంచి దూకికొవిడ్‌ బాధితుడి ఆత్మహత్య

ప్రధానాంశాలు

Published : 29/07/2021 05:58 IST

ఆసుపత్రి నుంచి దూకికొవిడ్‌ బాధితుడి ఆత్మహత్య

తిరుపతి (వైద్య విభాగం), న్యూస్‌టుడే: తిరుపతిలోని కొవిడ్‌ ఆసుపత్రి(స్విమ్స్‌-శ్రీపద్మావతి) మొదటి అంతస్తు నుంచి దూకి ఓ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన అయితేపల్లి కృష్ణయ్య(50) రెడ్డివారిపల్లి పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో ఈనెల 24న ఆస్పత్రిలో చేరారు. మంగళవారం రాత్రి గ్రిల్స్‌ లేని కిటికీ నుంచి కిందకి దూకగా అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ దేవేంద్రకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కొవిడ్‌ కారణంగా చనిపోతానేమోనన్న భయంతో తన బావ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బావమరిది హరినాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం డిశ్ఛార్జి చేయాల్సి ఉండగా అంతలోనే ఇలా జరిగిందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంగమ్మ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన