సీబీఐ అదుపులో యువరాజ్‌ యాదవ్‌

ప్రధానాంశాలు

Published : 29/07/2021 06:41 IST

సీబీఐ అదుపులో యువరాజ్‌ యాదవ్‌

ముమ్మరంగా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు

పులివెందుల, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ సమీప బంధువు, వరుసకు బావ అయిన యువరాజ్‌ యాదవ్‌ను బుధవారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అందుబాటులో లేని సునీల్‌కుమార్‌ యాదవ్‌ ఆచూకీ తెలుసుకునేందుకు, పలు అంశాలపై విచారణ చేసేందుకు పులివెందుల యర్రగుడిపల్లె వీధిలోని తన నివాసంలో ఉన్న యువరాజ్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. కొన్నేళ్లుగా జిల్లా కేంద్రమైన అనంతపురంలో యువరాజ్‌ యాదవ్‌ భార్య, పిల్లలతో కలసి నివసించేవాడు. కడప జిల్లాకు చెందిన ఇతడు అనంతపురం జిల్లాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వృత్తిరీత్యా అతను అరటి వ్యాపారం చేస్తుండగా, భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆరు నెలల కిందట ఆమె బదిలీల్లో భాగంగా కుటుంబం సహా కడప జిల్లా పులివెందులకు వచ్చేశారు. సునీల్‌కుమార్‌ యాదవ్‌ తన వ్యక్తిగత పనుల నిమిత్తం అనంతపురానికి వెళ్లినప్పుడు కొద్ది రోజులపాటు బావ యువరాజ్‌ యాదవ్‌ ఇంట్లోనే ఉండేవాడు. ఇది తెలుసుకున్న సీబీఐ అధికారులు విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన