అమరావతిలో చోరీలపై దర్యాప్తు

ప్రధానాంశాలు

Published : 30/07/2021 05:34 IST

అమరావతిలో చోరీలపై దర్యాప్తు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలోని వివిధ గ్రామాల్లో ఇటీవల జరిగిన ఇసుక, మట్టి, కంకర చోరీలపై కేసులు నమోదుచేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. హైకోర్టు భవనాల సమీపంలో ఇసుక, వెలగపూడిలోని సచివాలయం వెనుక రోడ్డులో నల్లమట్టి చోరీకి గురైన ప్రాంతాలను ఆయన గురువారం ఎస్సై సోమేశ్వరరావు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. పలువురు అనుమానితులను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన