న్యాయమూర్తులపై దూషణ కేసులోమరో ఇద్దరి అరెస్టు

ప్రధానాంశాలు

Published : 30/07/2021 05:41 IST

న్యాయమూర్తులపై దూషణ కేసులోమరో ఇద్దరి అరెస్టు

ఆగస్టు 11 వరకు రిమాండ్‌

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో దూషణలకు పాల్పడిన కేసులో మరో ఇద్దరిని సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని గుంటూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో గురువారం హాజరుపరచగా ఆగస్టు 11 వరకు రిమాండ్‌ విధిస్తూ ఇన్‌ఛార్జి న్యాయమూర్తి కె.అరుణ ఆదేశించారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పలు అభియోగాలు మోపుతూ పోస్టింగ్‌లు పెట్టడంతో అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా...అనంతరం కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే 15వ నిందితుడు లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేయగా బుధవారం ప్రధాన నిందితుడైన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం మూలపల్లికి చెందిన ధనిరెడ్డి కొండారెడ్డిని, 3వ  నిందితుడైన గుంటూరుకు చెందిన పాముల సుధీర్‌లను అరెస్టు చేశారు. వీరికి కొండారెడ్డి ధనిరెడ్డి వైఎస్సార్‌సీపీ, గుంటూరు మహానగరం పేరు మీద ఫేస్‌బుక్‌ ఖాతాలు ఉన్నాయి. నిందితుల్లో ఒకరైన పాముల సుధీర్‌ గుంటూరులో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన