AP News: ఆకతాయి పని... అన్నదాత ఆయువు తీసింది!

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 06:49 IST

AP News: ఆకతాయి పని... అన్నదాత ఆయువు తీసింది!

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

సంజామల, న్యూస్‌టుడే: ఎవరో ఆకతాయి చేసిన పని ఓ అన్నదాత నిండు ప్రాణాన్ని బలిదీసుకుంది. కర్నూలు జిల్లా సంజామల మండలం ఆర్‌.లింగందిన్నె స్థానికుల కథనం ప్రకారం... గ్రామంలోని పొలాల్లో కిందికి వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేసే క్రమంలో గురువారం ట్రాన్స్‌కో సిబ్బంది జంపర్లను తొలగించి సరఫరాను నిలిపివేశారు. గుర్తుతెలియని వ్యక్తి మూడు తీగల్లో ఒకదానికి విద్యుత్తు సరఫరా అయ్యేలా తీగను అతికించాడు. విషయాన్ని ఎవరూ గమనించలేదు. గ్రామానికి చెందిన మూరబోయిన శ్రీనివాసులు(45) వ్యవసాయంతోపాటు మూడు బర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. మేతకోసం వాటిని తన పొలానికి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం తాగునీటి కోసం పక్క పొలంలోని రైతుల వద్దకు వెళ్తుండగా మధ్యలో వేలాడుతున్న విద్యుత్తు తీగల్లో ఒకటి గాలుల తీవ్రతకు ఆయన మెడకు తగిలింది. విద్యుదాఘాతానికి గురైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసులుకు భార్య వెంకటలక్ష్మమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన