Crime News: కపట ప్రేమకు బెంగాల్‌ యువకుడి బలవన్మరణం

ప్రధానాంశాలు

Published : 31/07/2021 07:24 IST

Crime News: కపట ప్రేమకు బెంగాల్‌ యువకుడి బలవన్మరణం

‘పబ్జీ’ ఆటతో పరిచయం.. హైదరాబాద్‌కు రాక

శవాన్ని మరో ఇద్దరితో కలసి దహనం చేసిన యువతి

చేర్యాల, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో యువకులను ఆకర్షించి, డబ్బులు లాగేసుకొంటున్న యువతి మాయలో పడిన పశ్చిమ బెంగాల్‌ యువకుడు నగరానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఇద్దరితో కలసి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా సిద్దిపేట జిల్లా పరిధిలో కాల్చేసింది. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలను ఏసీపీ సందెపోగు మహేందర్‌ శుక్రవారం వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురికి చెందిన యువతి(28)కి వివాహమై విడాకులు తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు పెట్టి ఆకర్షించేది. పబ్జీ ఆటలో పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపాంకర్‌దాస్‌(24) పరిచయమయ్యాడు. కపట ప్రేమను నమ్మి గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌ వచ్చాడు. ఎస్‌ఆర్‌నగర్‌లో అద్దె గది తీసుకొని సహజీవనం సాగించారు. అతని వద్ద డబ్బులు అయిపోయాక వదిలించుకోవాలనే ఉద్దేశంతో వేధింపులకు గురి చేసేది. జులై 18న తీవ్ర గొడవ జరగగా అదే రోజు రాత్రి గదిలోని ఫ్యాన్‌కు దీపాంకర్‌ ఉరేసుకున్నాడు. నాగపురిలోని ఆమె సోదరుడు, అతని మిత్రుడు కలసి శవాన్ని కారులో జులై 20న చేర్యాల మండలం వీరన్నపేట శివారులో పెట్రోలు పోసి కాల్చారు. గుర్తు తెలియని మృతదేహమని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసు ఛేదించిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు రాకేశ్‌, నరేందర్‌రెడ్డి, పోలీసులను ఏసీపీ అభినందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన