గుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట రూ.76 లక్షల నగదు!

ప్రధానాంశాలు

Published : 31/07/2021 06:08 IST

గుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట రూ.76 లక్షల నగదు!

7.09 ఎకరాల భూ దస్తావేజులు లభ్యం
జప్తు చేసిన అనిశా అధికారులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ అక్రమార్జన చిట్టా బయటపడుతోంది. రిజిస్ట్రేషన్‌కు రూ.20 వేలు లంచం అడిగి గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన ఆయనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. యాదగిరిగుట్టలోని కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు జరిపారు. మరోవైపు హైదరాబాద్‌, మేడిపల్లిలోని ఆయన నివాసంలోనూ సోదాలు చేపట్టారు. ఆయన నివాసంలో రూ.76,09,500 నగదు లభించింది. ఆ సొమ్ముపై అధికారుల ప్రశ్నలకు దేవానంద్‌ నుంచి సమాధానం రాలేదని తెలిసింది. దీంతో పాటు 27.03 గ్రాముల 11 బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల భూమికి సంబంధించిన దస్తావేజులు లభించాయని, వీటికి సంబంధించిన వివరాలు తెలపకపోవడంతో జప్తు చేసినట్లు అనిశా జిల్లా ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌గా దేవానంద్‌ 6 సెప్టెంబరు 2019న బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మోత్కూరు సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన