ఎన్‌కౌంటర్లో మరణించింది ‘హిడ్మా’ సోదరుడే

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:23 IST

ఎన్‌కౌంటర్లో మరణించింది ‘హిడ్మా’ సోదరుడే

వెల్లడించిన పోలీసులు

చర్ల, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధి కుర్నపల్లి-బోదనెల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టును ‘మడవి ఉంగాల్‌ అలియాస్‌ చోటు’గా గుర్తించినట్టు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదలచేసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పువర్తి గ్రామానికి చెందిన ఇతను మావోయిస్టు 1వ నంబరు బెటాలియన్‌ కమాండర్‌ ‘హిడ్మా’ సోదరుడని, ప్రస్తుతం పీఎల్‌జీఏ 1వ బెటాలియన్‌ సభ్యుడిగా పనిచేస్తున్నాడని’ ఆ ప్రకటనలో తెలిపింది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచిన అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు వెల్లడించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన