ఆక్సిజన్‌ అందక మహిళ మృతి!

ప్రధానాంశాలు

Published : 04/08/2021 05:56 IST

ఆక్సిజన్‌ అందక మహిళ మృతి!

నల్గొండ జిల్లా ఆసుపత్రిలో బంధువుల ఆందోళన

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: సకాలంలో ఆక్సిజన్‌ అందకనే తమ బంధువు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆ మహిళ తరఫు బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన మంగళవారం నల్గొండ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్‌కి చెందిన నాగమ్మ(59) కొవిడ్‌ లక్షణాలతో గత నెల 24న జనరల్‌ ఆసుపత్రి కొవిడ్‌ వార్డులో చేరారు. వైద్యుల సూచన మేరకు రోజూ సిబ్బంది ఆమెకు ప్రాణవాయువు అందిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్లాంటు మరమ్మతుల కోసం కొంతసేపు ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేశారు. ఈ క్రమంలో నాగమ్మకు శ్వాస అందలేదని.. వార్డులో వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో ఆమె కన్నుమూసిందని బంధువులు ఆరోపించారు. ఇందుకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.జైసింగ్‌ రాథోడ్‌ స్పందిస్తూ వాస్తవాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టూటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన