కామాంధుడికి 30 ఏళ్ల జైలు శిక్ష

ప్రధానాంశాలు

Published : 04/08/2021 05:56 IST

కామాంధుడికి 30 ఏళ్ల జైలు శిక్ష

మానసిక వికలాంగురాలిపై హోంగార్డు అత్యాచారం కేసులో తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌-అడ్డగుట్ట, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: మానసిక వికలాంగురాలైన 16 ఏళ్ల ఎస్టీ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన హోంగార్డు మల్లికార్జున్‌కు న్యాయస్థానం 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. మరో రూ.50వేలను జరిమానాగా వేసింది. ఈ మేరకు నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి సునీత కుంచాల మంగళవారం తీర్పు వెలువరించారు. సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట పరిధిలో తల్లితోపాటు ఉంటున్న బాలికను  సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మల్లికార్జున గతేడాది సెప్టెంబరులో పరిచయం చేసుకున్నాడు. తన ఇంట్లోనే అద్దెకుండే ఆ బాలికపై  రెండు వారాలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాధితురాలి తల్లి ఆమెను తీసుకుని సిద్దిపేటకు వెళ్లింది. అక్కడ  ఈ ఏడాది ఫిబ్రవరిలో వైద్యురాలు పరీక్షించి బాలిక ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు.  మల్లికార్జున్‌  అత్యాచారం చేశాడంటూ బాలిక చెప్పడంతో బాధితురాలి తల్లి తుకారాంగేట్‌ పోలీస్‌ ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేశారు. వైద్యురాలి సూచన మేరకు బాధితురాలి ఆరోగ్యం దృష్ట్యా గర్భ విచ్ఛిత్తి చేయించారు. నేరం తీవ్రత ఆధారంగా నిందితుడికి న్యాయస్థానం 30 ఏళ్ల కారాగార శిక్ష విధించిందని పోలీసులు వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన