12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:18 IST

12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య

మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసిన నిందితుడు
మధ్యప్రదేశ్‌లో ఘటన

విదిశా: మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్య చేసి.. శవాన్ని ఓ చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు సమీపాన ఉన్న అడవి నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చుకుందామని బాలిక తల్లి, ఆమె అక్క బయలుదేరారు. వారి వెంటే బాలిక కూడా వెళ్లింది. తర్వాత కాసేపటికి ఆమె కనిపించకుండా పోయింది. బాలిక అప్పటికే ఇంటికి చేరుకుని ఉంటుందని భావించిన తల్లి.. తన పెద్ద కుమార్తెతో సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చింది. కానీ ఇంటి వద్ద కుమార్తె కనిపించక పోయేసరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలిక కోసం గాలించసాగారు. ఈ క్రమంలో అడవిలో ఓ చెట్టుకు తమ కుమార్తె మృతదేహం వేలాడి ఉండటం చూసి హతాశులయ్యారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. చున్నీతో ఆమెకు ఉరివేసి అక్కడున్న చెట్టుకు వేలాడదీశాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. నిందితులుగా భావిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన