వివాహేతర సంబంధమా? స్థిరాస్తి వివాదమా?

ప్రధానాంశాలు

Published : 11/08/2021 04:28 IST

వివాహేతర సంబంధమా? స్థిరాస్తి వివాదమా?

మెదక్‌ జిల్లాలో వ్యాపారి హత్య

 కారు సహా దహనం

మెదక్‌, వెల్దుర్తి - న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం, స్థిరాస్తి గొడవ నేపథ్యంలో ఒక వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి కారుతో సహా దహనం చేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామశివారు అటవీ ప్రాంతంలో ఓ కారు దగ్ధమైన విషయాన్ని స్థానికులు మంగళవారం పోలీసులకు చెప్పారు. వారు వచ్చి పరిశీలించగా కారు డిక్కీలో మృతదేహం కాలిపోయి కనిపించింది. అంతకుముందు తెల్లవారుజామున కారు దగ్ధమవుతుండగా, స్థానికులు సెల్‌ఫోన్‌తో ఫొటో తీశారు. ప్రమాదవశాత్తు దగ్ధమవుతోందని భావించారు తప్ప, అందులో మృతదేహం ఉందని ఎవరికీ తెలియదు. ఛాసిస్‌ సంఖ్య ఆధారంగా కారు నంబరు ‘టీఎస్‌15 ఈహెచ్‌4005’ అని పోలీసులు గుర్తించారు. అది మెదక్‌కు చెందిన ధర్మకార్‌ శ్రీనివాస్‌(47)ది అని తేలింది. శ్రీనివాస్‌ ఇంటికి చేగుంట ఎస్సై సుభాష్‌ వెళ్లి ఆయన కుటుంబసభ్యులను విచారించారు. తన భర్త సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బయటకు వెళ్లారని, కొద్దిసేపటి తర్వాత ఆయన సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేయగా కలవలేదని శ్రీనివాస్‌ భార్య హైందవి పోలీసులకు తెలిపారు. తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తరచూ తనతో గొడవ పడేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం కీలకంగా మారింది. పలువురితో స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లోనూ గొడవలు జరుగుతున్నాయి. ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

కృత్రిమ దంతాల ఆధారంగా..

మృతదేహం ఆనవాళ్లు గుర్తించడం కష్టమైంది. శ్రీనివాస్‌కు కృత్రిమ దంతాలుంటాయని కుటుంబసభ్యులు చెప్పడంతో వైద్యసిబ్బంది  ఆ దంతాలను గుర్తించి చనిపోయింది శ్రీనివాస్‌ అని నిర్ధరించారు. మెదక్‌లోని ఓ వ్యాపారి కుమారుడైన ధర్మకార్‌ శ్రీనివాస్‌కు స్థానికంగా ఓ థియేటర్‌ ఉంది. ఆయన గతంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కొన్నేళ్ల క్రితం ఓ వర్గానికి సంబంధించిన గ్రంథం ప్రతులను దహనం చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. శ్రీనివాస్‌ గతంలో నక్సలైట్లు కాల్పుల నుంచి తప్పించుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన