కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం

ప్రధానాంశాలు

Published : 19/08/2021 04:58 IST

కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం

వస్త్ర దుకాణంలో బూడిదైన దుస్తులు, ఫర్నిచర్‌

కోరుట్ల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆనంద్‌ వస్త్రదుకాణం (షాపింగ్‌మాల్‌)లో మంగళవారం అర్ధరాత్రి దాటాకా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో మాల్‌లోని విద్యుత్తు బ్యాటరీల వద్ద షార్ట్‌సర్క్యూట్‌ జరిగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుస్తులు, ఫర్నిచర్‌ అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక యంత్రం వచ్చేసరికే మాల్‌లోని నాలుగు అంతస్తులకూ మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ దుస్తులు, ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయాయి. భవనం పూర్తిగా కాలిపోయి దెబ్బతింది. రూ.కోట్లలో ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన