నిమజ్జనోత్సవాల్లో ఎమ్మెల్యే అనుచరుల దాడి

ప్రధానాంశాలు

Published : 15/09/2021 04:35 IST

నిమజ్జనోత్సవాల్లో ఎమ్మెల్యే అనుచరుల దాడి

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి కారును అడ్డుకోబోయిన ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శ్రీనివాసనగర్‌లో రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ఎమ్మెల్యే కారును వినాయక విగ్రహం ఊరేగింపులో పాల్గొన్న రెవెన్యూ క్వార్టర్స్‌కు చెందిన వరప్రసాద్‌ ఆపడానికి వెళ్లాడు. కారులో నుంచి దిగిన అంగరక్షకుడు అతన్ని తోసేశారు. అక్కడే ఎమ్మెల్యే అనుచరులు అతడిని చెప్పులతో కొట్టారు. ఎమ్మెల్యే కారు దిగకుండా వెళ్లిపోయారు. బాధితుడు ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో తెలియదని పోలీసులు చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన