వేటకు వెళ్లి.. ఉచ్చులో చిక్కి..!

ప్రధానాంశాలు

Updated : 15/09/2021 04:44 IST

వేటకు వెళ్లి.. ఉచ్చులో చిక్కి..!

విద్యుదాఘాతంతో ఇద్దరి మృత్యువాత

ములకలపల్లి, న్యూస్‌టుడే: జంతువుల కోసం అడవిలో వేటకు వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మొగరాళ్లగుప్ప గ్రామానికి చెందిన పాయం జాన్‌బాబు(25), కూరం దుర్గారావు(35) జంతువులు, పక్షులను వేటాడుతుండేవారు. సోమవారం రాత్రి మొగరాళ్లగుప్ప గ్రామానికి చెందిన ఒక బాలుడిని వెంట తీసుకొని మాదారం శివారులోని అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు జంతువుల కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకొని సపర్యలు చేస్తుండగానే.. జాన్‌బాబు, దుర్గారావు మృతిచెందారు. జాన్‌బాబు తండ్రి రాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన