చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

ప్రధానాంశాలు

Updated : 16/09/2021 07:21 IST

చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

ఈనాడు, విశాఖపట్నం, జగదాంబ, న్యూస్‌టుడే:  ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ఎనిమిదేళ్ల చిన్నారిపై  65 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి ప్రయత్నించిన ఉదంతం కలకలం రేపింది. బాలికను ముద్దు చేస్తున్నట్లుగా నటిస్తూ సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లబోయాడు. ఆ వృద్ధుడి పైశాచిక ప్రవృత్తిని గ్రహించిన కొందరు అప్రమత్తమై ఉదంతాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. నిందితుడిని పట్టుకుని నిలదీయడంతో అతని గుట్టురట్టైంది. ఈ మేరకు స్థానికులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వృద్ధుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన విషయం వాస్తవమేనని నిర్దారించుకొని అరెస్టు చేశారు. పోక్సో కేసు నమోదు చేసినట్లు హార్బర్‌ ఏసీపీ శిరీష ‘ఈనాడు’కు వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన