ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల కారాగారం

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:21 IST

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల కారాగారం

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్‌ గిడ్డా ప్రకాశ్‌(43)కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు సెషన్స్‌ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. బాలిక, ఆమె అన్నను నిందితుడు ప్రకాశ్‌ ప్రతిరోజూ ఉదయం తన ఆటోలో పాఠశాలకు, సాయంత్రం అక్కడి నుంచి ట్యూషన్‌కు తీసుకెళ్లి రాత్రి 7 గంటలకు ఇంట్లో దిగబెట్టేవాడు. 2015 ఫిబ్రవరి 5న ట్యూషన్‌ నుంచి ఇంటికి తీసుకెళ్తూ మార్గంమధ్యలో జనసంచారం లేని ప్రాంతంలో ఆటోను నిలిపాడు. పిల్లలిద్దర్నీ బెదిరించి.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. నిందితుడిపై అభియోగం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన