ఝార్ఖండ్‌లో కారు-బస్సు ఢీ

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:21 IST

ఝార్ఖండ్‌లో కారు-బస్సు ఢీ

ఐదుగురు అగ్నికి ఆహుతి

రజ్‌రప్ప: ఝార్ఖండ్‌ రాష్ట్రం రామ్‌గఢ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన ఓ కారు, బస్సు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు తలెత్తాయి. అనంతరం బస్సుకూ మంటలు వ్యాపించాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. రజ్‌రప్ప పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముర్బంద వద్ద 23వ నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులు పట్నాకు చెందినవారని, బస్సు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన