కారం చల్లి.. పెట్రోల్‌ పోసి..

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:57 IST

కారం చల్లి.. పెట్రోల్‌ పోసి..

అటవీ అధికారులపై పోడుదారుల హత్యాయత్నం

భూపాలపల్లి, న్యూస్‌టుడే: తమ సిబ్బందిపై పోడుదారులు కారంపొడి చల్లి.. పెట్రోలు పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారి లావణ్య తెలిపారు. సుమారు అరగంట సేపు దాడికి పాల్పడటమే కాకుండా తమ వాహనంపై పెట్రోల్‌ పోసి, కత్తులతో బెదిరించారన్నారు. ఆమె తెలిపిన వివరాలివి. ‘‘ఆజంనగర్‌ అటవీ రేంజి పరిధిలోని పందిపంపుల గ్రామ సమీపంలో 10 ఎకరాల్లో ఇటీవల అటవీ సిబ్బంది మొక్కలు నాటారు. పంబాపూర్‌ గ్రామానికి చెందిన కొమ్ము మహేష్‌ ఆధ్వర్యంలో పందిపంపుల, పంబాపూర్‌, కాల్వపెల్లి గ్రామాలకు చెందిన కొందరు వాటిని తొలగించినట్లు సమాచారం అందింది. ఆజంనగర్‌ అటవీ రేంజి ఆఫీసర్‌ గుడూరి దివ్య, సెక్షన్‌ అధికారి మోహన్‌, బీట్‌ అధికారులు, బేస్‌ క్యాంపు సిబ్బంది ఆరుగురు పందిపంపుల గ్రామానికి వెళ్లారు. అక్కడి పోడుదారులు రేంజి అధికారి దివ్య, సిబ్బందిపై దాడి చేశారు. కారం పొడి చల్లి, పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు యత్నించారు. వాహనంపై పెట్రోల్‌ పోసి, కత్తులతో బెదిరించారు. 2 గంటలు  నిర్బంధించారు. నేను భూపాలపల్లి, దూదేకులపల్లి అటవీ రేంజి అధికారులను పందింపంపుల గ్రామానికి పంపించా. అటవీ అధికారులు, పోలీసులు చేరుకోవటంతో పోడుదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అస్వస్థతకు గురైన రేంజి అధికారి దివ్య, సెక్షన్‌ అధికారి మోహన్‌, బీట్‌ ఆఫీసర్‌ మర్రి శ్రీనును భూపాలపల్లి ఆసుపత్రికి తరలించాం. దాడికి పాల్పడిన పది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని డీఎఫ్‌వో లావణ్య తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన