గజ్జెకట్టి ఆడుతుండగానే ఆయువు పోయింది

ప్రధానాంశాలు

Published : 19/09/2021 05:17 IST

గజ్జెకట్టి ఆడుతుండగానే ఆయువు పోయింది

విద్యుదాఘాతంతో ఇద్దరు కళాకారుల మృతి

కాజులూరు, మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నవరాత్రి సంబరాలు జరుగుతున్నాయి. కళాకారులు గజ్జెకట్టి ఆడుతుంటే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అంతలోనే విద్యుదాఘాతంతో ఇద్దరు కళాకారులు కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం కోలంకలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామాలయం వద్ద కోల సంబరం ఏర్పాటు చేశారు. అందులో కపిలేశ్వరపురం మండలం నల్లూరుకు చెందిన వాసంశెట్టి శ్రీనివాస్‌(30), రామచంద్రపురం మండలం బాపనమ్మ చెరువుకు చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావు(47) ఆడుతున్నారు. సంబరం ముగింపు దశలో ఉండగా వారు పట్టుకున్న మైకుకు విద్యుత్తు ప్రసరించడంతో ఇద్దరూ కుప్పకూలిపోయారు. వారిని యానాం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వాసంశెట్టి శ్రీనివాస్‌ కూలి పనులకు వెళ్తుంటారు. ఉత్సవాల సమయంలో కోల సంబరాల్లో ఆడుతుంటారు. ఆ వచ్చే మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. శ్రీనివాస్‌ తండ్రి క్యాన్సర్‌, తల్లి పక్షవాతంతో బాధపడుతున్నారు. మరో మృతుడు మేడిశెట్టి శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. కోల సంబరాల్లో వేషాలు, ఇతర చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన