Crime News: వరుసకు సోదరుడని తెలియక ప్రేమ వివాహం.. ఆపై..

ప్రధానాంశాలు

Updated : 22/09/2021 12:09 IST

Crime News: వరుసకు సోదరుడని తెలియక ప్రేమ వివాహం.. ఆపై..

 సోషల్‌ మీడియాలో ప్రచారంతో యువతి బలవన్మరణం

యువకుడి ఆత్మహత్యాయత్నం 

ప్రేమ పెళ్లి విషాదాంతం!

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఆ తర్వాత ఎవరింటికి వాళ్లు వచ్చి ఉంటున్నారు.. అకస్మాత్తుగా సోషల్‌ మీడియాలో పెళ్లి ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన బంధువులు వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని తేల్చారు. దీంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడగా.. యువకుడూ ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి(21), యువకుడు(24) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. యువకుడికి తన సోదరి ద్వారా ఆ యువతి పరిచయమైంది. వీరిద్దరూ పది రోజుల క్రితం హైదరాబాద్‌ శివారులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి ఇంట్లో వారుంటున్నారు. ఇటీవల వీరి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమంలో ప్రచారమయ్యాయి. దూరపు బంధువులు అవుతారని.. వరుసకు సోదరి, సోదరులని చుట్టాలు తేల్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి పురుగులమందు తాగి మంగళవారం బలవన్మరణం చెందింది. విషయం తెలుసుకున్న యువకుడు కూడా పురుగులమందు తాగి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు అతడిని వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన