వారి నుంచి నాకు ప్రాణభయం ఉంది

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:12 IST

వారి నుంచి నాకు ప్రాణభయం ఉంది

కాకినాడ మేయర్‌ సుంకర పావని

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: అవిశ్వాస నోటీసు ఇచ్చినప్పటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధి తనను ఎన్నో రకాలుగా వేధిస్తున్నారని కాకినాడ మేయర్‌ సుంకర పావని ఆరోపించారు. బుధవారం  తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా తన ఇంటిని కేంద్రీకరిస్తూ ఎదురుగా ఉన్న వేరొకరి గృహంపై ఉన్న సీసీ కెమెరాతో నిఘా పెట్టారన్నారు. తన కదలికలు గుర్తించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చి స్మార్ట్‌సిటీ కెమెరాలను సైతం వినియోగిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో తనపై ప్రయోగించిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కుంటానని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది అపరిచిత వ్యక్తులు కొద్దిరోజులుగా తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని, తనకు ప్రాణభయం ఉందని వాపోయారు. ఇదే విషయమై మేయర్‌ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సీఐ శ్రీరామకోటేశ్వరరావు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. అప్పటికీ మేయర్‌ నివాసానికి ఎదురుగా కొందరు యువకులు ఉండటంతో సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ నుంచి పంపించేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన