భార్యను ఉరేసుకొమ్మని.. వీడియో తీస్తూ...

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:12 IST

భార్యను ఉరేసుకొమ్మని.. వీడియో తీస్తూ...

అనుమానంతో ఓ భర్త పైశాచికత్వం
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ధర్మార్థ కామమోక్షాలలో ఎన్నడూ చేయి వీడను అని.. నాతిచరామి అంటూ బాసలు చేశాడు. చివరికి అతడే అనుమానంతో వేధించసాగాడు. దగ్గరుండి మరీ ఉరిని ప్రోత్సహించాడు. కళ్లెదుటే భార్య ఉరి వేసుకుంటున్నా ‘వేసుకో.. వేసుకో..’ అంటూ ప్రోత్సహించి చివరకు కడతేర్చాడు. హృదయవిదారక ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం వెలుగుచూసింది. ఎస్సై శివశంకర్‌ తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు జగన్నాథరావుపేటలో ఉంటున్న పెంచలయ్యకు అనంతసాగరం మండలం కొత్తపల్లికి చెందిన కొండమ్మ(31)తో వివాహమైంది. భర్త ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డు కాగా, ఆమె ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న పెంచలయ్య ఆమెను వేధించడం ప్రారంభించాడు. దాంతో ఆమె విసుగు చెంది బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇంట్లో ఫ్యాన్‌కు భర్త ముందే ఉరేసుకొనేందుకు సిద్ధమయ్యారు. ఎదురుగానే ఉన్న భర్త దాన్ని అడ్డుకోకుండా వీడియో తీస్తూ, వేసుకో వేసుకో అంటూ ప్రోత్సహించాడు. దాంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీడియోను అతడు కొండమ్మ బంధువులకు పంపించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెంచలయ్యను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన