మావోయిస్టుల చేతిలో గుమస్తా హత్య

ప్రధానాంశాలు

Published : 25/09/2021 05:03 IST

మావోయిస్టుల చేతిలో గుమస్తా హత్య

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: రోడ్డు పనుల గుత్తేదారు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలోని చోటే దొంగర్‌ అటవీ ప్రాంతంలో ప్రభుత్వం కొత్తగా రహదారి నిర్మాణం చేపట్టింది. దీనిపై ఆగ్రహించిన మావోయిస్టులు గురువారం రాత్రి రోడ్డు పనులకు వినియోగిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌, మరికొన్ని వాహనాలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అంతటితో ఆగకుండా గుత్తేదారుడి వద్ద గుమస్తాగా పని చేస్తున్న ఓ వ్యక్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అమ్‌డాయ్‌ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. 

తుపాకీ పేలి జవాను మృతి
సీఆర్‌పీఎఫ్‌ 229 బెటాలియన్‌కు చెందిన త్రిలోక్‌సింగ్‌(45) అనే జవాన్‌ సహచరులతో కలిసి శుక్రవారం ఊసూర్‌ నుంచి బస్సులో బీజాపూర్‌ వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆయన వద్ద ఉన్న తుపాకీ పేలి బుల్లెట్‌ తలలో దిగింది. వెంటనే ఆయన్ను సహచరులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు సుకుమా జిల్లా చింతగుపా పోలీస్‌ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ సమక్షంలో లొంగిపోయారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన