ఎమ్మెల్యే కుమారుడిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:15 IST

ఎమ్మెల్యే కుమారుడిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు

 ఐదుగురిపై కేసు, ఒకరి అరెస్టు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను కుమారుడు వెంకటకృష్ణప్రసాద్‌ గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం ఆయన జగ్గయ్యపేటలో విలేకరులతో మాట్లాడారు. వెంకటకృష్ణప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని, నందిగామ మండలం మాగల్లుకు చెందిన బండి మహేష్‌, పి.వంశీకృష్ణ, లగడపాటి ప్రవీణ్‌, చెరుకూరి మధు.. తమకు వచ్చిన సందేశాన్ని ఫార్వర్డ్‌ చేశారని పేర్కొన్నారు. వీరిలో బండి మహేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. గుంటూరుకు చెందిన ఓ వెబ్‌సైట్‌ ప్రతినిధి నల్లారి మురళీకృష్ణ కూడా ఇందులో భాగస్వామి అని, ఈ మెసేజ్‌ను తొలుత ఎవరు రూపొందించారో తేలాల్సి ఉందని చెప్పారు. నిందితులందరూ తెదేపా సానుభూతిపరులుగా గుర్తించినట్లు సీఐ తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన