ఎఫ్‌డీల మాయంపై పోలీసులకు ఫిర్యాదు

ప్రధానాంశాలు

Published : 14/10/2021 05:10 IST

ఎఫ్‌డీల మాయంపై పోలీసులకు ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర గోదాముల సంస్థ, ఆయిల్‌ఫెడ్‌లో బయటపడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాయంపై ఆయా సంస్థల అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాముల సంస్థకు సంబంధించి భవానీపురంలోని ఐవోబీలో తొమ్మిది విడతలుగా రూ.9.5 కోట్ల మేర సొమ్మును అధికారులు ఎఫ్‌డీ చేశారు. ఇటీవల ఆరా తీయగా గడువు తీరకుండానే వాటిని మాయం చేసినట్లు తేలింది. దీనిపై సంస్థ అధికారులు బుధవారం భవానీపురం స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. పోలీసుల సూచన మేరకు మరిన్ని వివరాలను గురువారం అందచేయనున్నారు. అలాగే గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఆయిల్‌ఫెడ్‌ సంస్థకు చెందిన రూ.5 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను నెలరోజుల్లో డ్రా చేసిన వ్యవహారంపై గన్నవరం స్టేషనులో ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండింటిపై గురువారం కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన