గొంతు నులిమి బాలుడి హత్య

ప్రధానాంశాలు

Updated : 14/10/2021 15:56 IST

గొంతు నులిమి బాలుడి హత్య

చిత్తూరు జిల్లాలో ఘటన

కంభంవారిపల్లె, న్యూస్‌టుడే: అదృశ్యమైన బాలుడు మృతదేహమై కనిపించిన ఉదంతం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కంభంవారిపల్లె మండలం సంకేనిగుట్టపల్లెకు చెందిన నాగిరెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు తేజష్‌రెడ్డి(8). దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్తూ కుమారుడిని పీలేరులో నివాసం ఉండే జ్యోతి సోదరి కల్యాణి దగ్గర ఉంచారు. తేజష్‌రెడ్డి అక్కడే మూడో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు కావడంతో జ్యోతి తండ్రి నాగిరెడ్డి సోమవారం తేజష్‌ను ఎగువమేకలవారిపల్లెకు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. బంధువులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం పల్లె సమీపంలో వెతుకుతుండగా పొలంలో తేజష్‌ మృతదేహం కనిపించింది. బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన