రూ.1.45 కోట్ల నగదు స్వాధీనం

ప్రధానాంశాలు

Published : 14/10/2021 05:14 IST

రూ.1.45 కోట్ల నగదు స్వాధీనం

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా జరిపిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 1,45,20,727 నగదును పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అరికట్టేందుకు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు. నగదుతో పాటు రూ. 1.5 లక్షల విలువ గల 30 గ్రాముల బంగారం, రూ. 9.1 లక్షల విలువ గల 14 కిలోల వెండి, రూ. 5,11,652 విలువ చేసే 867 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు రూ. 2,21,000 విలువ గల 66 చీరలు, 50 చొక్కాలను, రూ. 19,750 విలువ గల 3.51 కిలోల గంజాయిని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన