ఆన్‌లైన్‌ మోసానికి బీటెక్‌ విద్యార్థి బలి

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:04 IST

ఆన్‌లైన్‌ మోసానికి బీటెక్‌ విద్యార్థి బలి

సాలూరు, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టిన ఓ విద్యార్థి మోసపోయినట్లు గుర్తించి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కుమారుడి అకాల మరణంతో తల్లి బోరున విలపించారు. సాలూరులోని పెదకుమ్మరవీధికి చెందిన కేశవశ్రీనివాస్‌(19) బీటెక్‌ రెండో ఏడాది చదువుతున్నారు. ఆన్‌లైన్లో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నారు. ఆ సమయంలో కొన్ని వెబ్‌సైట్ల నుంచి వచ్చిన లింకులు చూసి ఇంట్లో చెప్పకుండా రూ.30 వేలు పెట్టుబడి పెట్టాడు. వారిచ్చిన టాస్కు పూర్తి చేయలేదని ఆ డిపాజిట్‌ మొత్తాన్ని తీసుకొని మరికొంత చెల్లించాలంటూ సైట్ల నిర్వాహకులు డిమాండ్‌ చేశారు. తాను మోసపోయినట్లు గుర్తించిన శ్రీనివాస్‌ విషయం తల్లి విశాలాక్షికి తెలపడంతో ఆమె మందలించారు. గురువారం తల్లి గుడికి వెళ్లిన సమయంలో శ్రీనివాస్‌ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదేళ్ల క్రితం భర్త మరణించిన నాటి నుంచి రెక్కల కష్టంతో పిల్లలిద్దరినీ పెంచిన విశాలాక్షి.. కుమారుడి మృతిని తట్టుకోలేక గుండెలవిసేలా రోదించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన