నిమజ్జనోత్సవంలో విషాదం

ప్రధానాంశాలు

Published : 17/10/2021 04:24 IST

నిమజ్జనోత్సవంలో విషాదం

ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురి దుర్మరణం

ముదిగొండ, న్యూస్‌టుడే: దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళుతూ ట్రాక్టర్‌ బోల్తా పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు.. ముదిగొండ మండలం కమలాపురం నుంచి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మున్నేరు నదికి తరలించారు. ఒక ట్రాక్టర్‌లో విగ్రహం ఉండగా.. మరో ట్రాక్టర్‌లో పది మంది గ్రామస్థులు, యువకులు ఎక్కారు. విగ్రహం ఉన్న ట్రాక్టర్‌ గంధసిరి మున్నేరు నది వద్దకు వెళ్లింది. వెనుకనున్న మరో ట్రాక్టర్‌ అటుకాకుండా వల్లభి వైపు వెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వాహనం వేగానికి తోడు, వర్షం కురుస్తుండటంతో అయ్యగారిపల్లి వద్ద ట్రాక్టర్‌ బోల్తాపడింది. ట్రక్కు కింద పడి గ్రామానికి చెందిన ఉపేందర్‌(32), ఉమ(40), నాగరాజు(24), స్వామి(50) మరణించారు. ఉమ హైదరాబాద్‌లో నివాసముంటూ.. పండుగకు స్వగ్రామానికి వచ్చింది. ముగ్గురు క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన