బస్సు, లారీ ఢీ: ఇరుక్కుపోయిన ఇంద్ర డ్రైవర్‌

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 06:15 IST

బస్సు, లారీ ఢీ: ఇరుక్కుపోయిన ఇంద్ర డ్రైవర్‌

ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: ఖమ్మం కొత్త కలెక్టరేట్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు 2.00 గంటల సమయంలో ఏపీఎస్‌ ఆర్టీసీ ఇంద్ర బస్సు, లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ ధాటికి రెండు వాహనాలు రహదారి నుంచి పక్కకు దూసుకెళ్లాయి. లారీ బోల్తా పడగా బస్సులో డ్రైవర్‌ ఇరుక్కుపోయాడు. ప్రయాణికుల్లో కొందరికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ను బయటికి తీసేందుకు లారీ డ్రైవర్లు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మంవైపు వస్తున్న లారీని వెనుక వస్తున్న బస్సు అదుపుతప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన