అనుమానిత ప్రాంతాల్లో భద్రతా బలగాల జల్లెడ

ప్రధానాంశాలు

Updated : 19/10/2021 05:26 IST

అనుమానిత ప్రాంతాల్లో భద్రతా బలగాల జల్లెడ

ఏటూరునాగారం, దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: అనారోగ్యం కారణంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిచెందిన అనంతరం పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టు కీలక నేతలు ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వైపు వచ్చి ఉంటారని పోలీసుల అనుమానం. దీంతో ములుగు, జయశంకర్‌-భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానిత ప్రదేశాలను జల్లెడ పడుతున్నారు.

గొత్తికోయగూడేలను చుట్టుముట్టి తనిఖీ

ఆర్కే అంత్యక్రియలకు పలువురు గొత్తికోయలు హాజరయ్యారనే సమాచారంతో వారి నుంచి వివరాలు తెలుసుకొనేందుకు పోలీసులు గొత్తికోయగూడేలను జల్లెడ పడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి విడిచిపెడుతున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాంతాలపై వారికి పెద్దగా పట్టుండేది కాదు. ఇటీవల ఒక గూడెంలో ఎన్ని గుడిసెలున్నాయి, ఎంత మంది ఉన్నారు, వారు ఎక్కడి వారు, ఏం పని చేస్తున్నారు తదితర వివరాలు పిల్లలు, పెద్దలతో కలిసి ఫొటోలతో సహా సమాచారాన్ని సేకరించారు. దీంతో ఎవరైనా గొత్తికోయగూడెంలోకి కొత్త వ్యక్తులు వస్తే వెంటనే తెలిసిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన