బాలికపై విశ్రాంత ఉద్యోగి అత్యాచారం

ప్రధానాంశాలు

Published : 20/10/2021 07:05 IST

బాలికపై విశ్రాంత ఉద్యోగి అత్యాచారం

నిందితుడి అరెస్ట్‌

భీమారం, న్యూస్‌టుడే: ఉన్నత విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పని చేసి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ పొందిన ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఇది. కేయూ ఎస్సై సతీశ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బింగి భిక్షపతి అనే విశ్రాంత ఉద్యోగి భార్యతో కలిసి హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. పొరుగింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలికపై కన్నేసిన ఆయన మాయ మాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం ఈ విషయాన్ని గుర్తించిన బాలిక పెద్దమ్మ కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి భిక్షపతికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. నిందితుడిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అతనిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన