రూ.2.96 కోట్ల విలువైన బంగారం పట్టివేత

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:20 IST

రూ.2.96 కోట్ల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్‌లో  ఇద్దరు ప్రయాణికుల అరెస్ట్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం సుమారు రూ. 2.96 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి రీఛార్జింగ్‌ బ్యాటరీ (లాంతర్‌)ల మాటున అక్రమంగా బంగారం తీసుకొస్తున్న ఇద్దరు ప్రయాణికులను భద్రతాధికారులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో స్వదేశానికి వచ్చారు. 6.06 కిలోల బంగారాన్ని కరిగించి రీఛార్జింగ్‌ బ్యాటరీ(లాంతర్‌)ల లోపల అమర్చి సామగ్రిలో పెట్టుకొని తరలిస్తున్నారు. సదరు ప్రయాణికుల ప్రవర్తనపై అనుమానం రావడంతో విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని  సామగ్రిని పరిశీలించగా అక్రమ బంగారం తరలింపు గుట్టురట్టయింది. రూ.2.96 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక సూత్రధారులు ఎవరన్న దానిపై విచారిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన