పట్టాభి ఇంటిపై దాడి ఘటనపై కేసు నమోదు

ప్రధానాంశాలు

Published : 21/10/2021 05:45 IST

పట్టాభి ఇంటిపై దాడి ఘటనపై కేసు నమోదు

ఈనాడు, అమరావతి: తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి విజయవాడలోని పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభి సతీమణి చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 148, 149, 427, 452, 506 సెక్షన్ల కింద 60 మందిపై కేసు కట్టారు. మారణాయుధాలతో వచ్చి గొడవ చేయడం, నేరం చేసేందుకు ఒక చోట గుమికూడడం, ఆస్తి నష్టం కలిగించడం, అనుమతి లేకుండా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం, దాడికి పాల్పడడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ బెయిల్‌ వచ్చేవన్నారు. పట్టాభిని హత్య చేయడానికే దుండగులు వచ్చారని..సెక్షన్‌ 307 కింద నమోదు చేయాలని పట్టుబట్టినా స్పందించలేదని ఆరోపిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన