ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌

ప్రధానాంశాలు

Published : 22/10/2021 04:51 IST

ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌

అగ్రిమెంట్‌ రద్దుకు రూ.5 లక్షల డిమాండ్‌

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ను రద్దు చేయడానికి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు గురువారం వలపన్ని పట్టారు. ఏసీబీ డీఎస్‌పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. లంగర్‌హౌస్‌లో నివాసం ఉండే అరవింద్‌ మహేష్‌కుమార్‌కు గందంగూడలో 300 గజాల స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించి ఓ వ్యక్తితో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ వ్యక్తి సకాలంలో ప్రక్రియ పూర్తిచేయకపోవడంతో దానిని రద్దుచేసేందుకు అరవింద్‌ నిర్ణయించుకుని రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. అగ్రిమెంట్ రద్దు చేయించాలని అక్కడి డాక్యుమెంట్ రైటర్‌ వాసుతో చర్చించారు. వాసు సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌అలీని సంప్రదించగా రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో అరవింద్‌ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు అరవింద్‌ రూ.5 లక్షలను డాక్యుమెంట్ రైటర్‌ వాసుకి ఇచ్చారు. అతడు సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌అలీకి ఇవ్వడానికి సమాయత్తం అవుతుండగా.. వాసు, సబ్‌రిజిస్ట్రార్‌లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన