నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ప్రధానాంశాలు

Published : 22/10/2021 04:51 IST

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంపై స్థానిక సీఐ కనకయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఠాణా పరిధిలో నివసించే ఓ కుటుంబానికి నాలుగు సంవత్సరాల బాలిక ఉంది. వారి ఇంటి పక్కనే నివసించే హైదర్‌గూడ కాంతు(20) అనే యువకుడు మద్యానికి అలవాటుపడ్డాడు. అతను ఈ నెల 15న బాలికకు చాక్లెట్‌ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు జరిగిన ఘోరాన్ని గుర్తించారు. అయితే వారు స్థానికులు కాకపోవడంతో భయపడి అదేరోజు మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని వారి స్వగ్రామానికి వెళ్లిపోయారు. తరువాత పాప ఆరోగ్యం బాగాలేకపోవడంతో గ్రామంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో స్వగ్రామానికి చెందిన కొందరి సహకారంతో గురువారం రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన